Enforcement Directorate: మూడో రోజు ముగిసిన రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌... ఎల్లుండి కూడా కొన‌సాగ‌నున్న విచార‌ణ‌

ec concludes third day investigation of rahul gandhi and asks him to appear on friday

  • మూడో రోజు 9 గంట‌ల పాటు రాహుల్‌ విచార‌ణ‌
  • మ‌ధ్యాహ్న భోజ‌న విరామం ఇచ్చిన ఈడీ అధికారులు
  • గురువారం విచార‌ణ‌కు విరామం ఇచ్చిన ఈడీ
  • శుక్ర‌వారం విచార‌ణ‌కు రావాలంటూ రాహుల్‌కు స‌మ‌న్లు

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వ‌రుస‌గా మూడో రోజైన బుధ‌వారం కూడా విచార‌ణ‌కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. తొలి రెండు రోజులూ సుదీర్ఘంగానే విచారించిన ఈడీ అధికారులు బుధవారం కాస్తంత త‌క్కువ‌గా 9 గంట‌ల పాటు ఆయనను విచారించారు. తొలి రెండు రోజుల మాదిరే బుధ‌వారం కూడా రాహుల్‌ను మ‌ధ్యాహ్న భోజ‌నం కోసం ఇంటికెళ్లేందుకు అనుమ‌తించారు.

ఇదిలా ఉంటే... నేష‌న‌ల్ హెరాల్డ్ వ్య‌వ‌హారంలో శుక్రవారం కూడా విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు రాహుల్ గాంధీకి స‌మ‌న్లు అందించారు. బుధ‌వారం విచార‌ణ ముగిసిన త‌ర్వాత ఈ మేర‌కు ఈడీ అధికారులు రాహుల్‌కు స‌మ‌న్లు అంద‌జేశారు. గురువారం విచారణకు విరామం ఇచ్చారు. 

  • Loading...

More Telugu News