Jagan: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదు: జగన్

Jagan comments on 10th class results

  • ఫెయిల్ అయిన వారికి కంపార్ట్ మెంట్ పరీక్షలు పెడతామన్న సీఎం  
  • ఇందులో పాస్ అయిన వారిని రెగ్యులర్ గా పరిగణిస్తామని వెల్లడి 
  • విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్న జగన్ 

ఏపీ పదో తరగతి పరీక్షల్లో నిరాశాజనకమైన ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువగా రావడం అందరినీ కలవరానికి గురి చేసింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తక్కువగా రావడాన్ని తప్పుగా భావించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి నెల రోజుల్లోనే మళ్లీ కంపార్ట్ మెంట్ ఎగ్జామ్స్ పెడతామని... ఇందులో పాస్ అయిన వారిని కూడా రెగ్యులర్ గానే పరిగణిస్తామని చెప్పారు. 

పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన వారికి కూడా బెటర్ మెంట్ రాసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని సీఎం తెలిపారు. ఏదైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్ మెంట్ రాసుకోవచ్చని అన్నారు. 49 లేదా అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు రూ. 500 ఫీజు కట్టి రెండు సబ్జెక్టుల్లో బెటర్ మెంట్ రాసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

  • Loading...

More Telugu News