USA: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల తొలిసారి స్పందించిన అమెరికా
- ప్రవక్తపై నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ వ్యాఖ్యలు
- కేంద్రానికి ఇబ్బందికరంగా మారిన వైనం
- ఇప్పటికే ఇస్లామిక్ దేశాల నుంచి నిరసన
- మానవ హక్కులపై గౌరవం పెంపొందించుకోవాలన్న అమెరికా
బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల పట్ల అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. బీజేపీకి చెందిన ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది.
ఈ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ కూడా బహిరంగంగా ఖండించడం తమ దృష్టికి వచ్చిందని, మానవ హక్కులపై గౌరవాన్ని పెంపొందించుకోవాలని భారత్ కు సలహా ఇస్తున్నాం అని అమెరికా హితవు పలికింది. మతస్వేచ్ఛ, మానవ హక్కుల ఆందోళనలు తదితర అంశాలపై భారత కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతుంటామని నెడ్ ప్రైస్ పేర్కొన్నారు.