Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం ముందస్తు ప్రణాళికలో భాగమేనా?.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్‌లు

Whatsapp massages goes viral on secunderabad violence

  • రైళ్లను తగలబెట్టడానికి రావాలంటూ వాట్సాప్ మెసేజ్‌లు
  • ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసుల ఆరా
  • భారీ బందోబస్తు మధ్య నడుస్తున్న రైళ్లు

‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో నిన్న జరిగిన విధ్వంసం ముందస్తు పథకం ప్రకారం జరిగిందేనా? వైరల్ అవుతున్న వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లు చూస్తుంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. నిరసనలకు పిలుపునిచ్చిన ఈ సందేశాల్లో.. రైళ్లను తగలబెట్టడానికి రావాలంటూ పిలుపునిచ్చినవి కూడా ఉండడం గమనార్హం. దీంతో ఈ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. 

మరోవైపు, నిన్న జరిగిన హింసాకాండ నేపథ్యంలో స్టేషన్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్, సీఆర్పీపీఎఫ్, రైల్వే, తెలంగాణ పోలీసు బలగాలను స్టేషన్ వద్ద మోహరించారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. స్టేషన్ పరిసరాల్లో జనం పెద్ద ఎత్తున గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. కాగా, అల్లర్ల నేపథ్యంలో నిన్న నిలిచిపోయిన రైళ్లు నేడు భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News