Sabitha Indra Reddy: మీరు ఎండలో, వానలో కూర్చోవడం చూస్తుంటే ఓ అమ్మగా బాధేస్తోంది: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సబితా ఇంద్రారెడ్డి లేఖ

Sabitha Indrareddy wrote Basara IIIT Students

  • డిమాండ్ల సాధన కోసం బాసర విద్యార్థుల ధర్నాలు
  • ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందన్న సబిత
  • ఆందోళన విరమించాలని విజ్ఞప్తి
  • ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచన

తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉద్దేశించి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దయచేసి ఆందోళన విరమించాలని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. 

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం డైరెక్టర్ ను నియమించినట్టు వెల్లడించారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణను ప్రభుత్వం బాసర విద్యార్థుల వద్దకు పంపించిందని, విద్యార్థులు ఆయనతో చర్చించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. విద్యార్థుల సమస్యలను తక్కువ చేసి చూడడం లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్ల పాటు క్లాసులు సరిగ్గా జరగక, కొన్ని అంశాల పరిష్కారంలో జాప్యం జరిగి ఉండొచ్చని అంగీకరించారు.

గత కొన్నిరోజులుగా ఎండలో, వానలో మీరు కూర్చోవడం చూస్తుంటే మీ మంత్రిగానే కాదు... ఒక అమ్మగా బాధ కలిగిస్తోంది అని పేర్కొన్నారు. ఇది మీ ప్రభుత్వం... దయచేసి చర్చించండి అని హితవు పలికారు. ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరిస్తుంది అని స్పష్టం చేశారు.
.

  • Loading...

More Telugu News