Ayyanna Patrudu: టీడీపీ నేత అయ్యన్న ఇంటి గోడను కూల్చేసిన మునిసిపల్ సిబ్బంది.. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

municipal officials demolish tdp leader ayyanna house compound wall

  • తెల్లవారుజామున జేసీబీతో కూల్చేసిన మునిసిపల్ అధికారులు
  • ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించారంటూ నోటీసులు
  • ఎప్పుడో జారీ చేసిన నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే కూల్చివేత
  • అయ్యన్న ఇంటికి వెళ్లే దారుల మూసివేత

నర్సీపట్నంలో అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. అంతకుముందు ఆయన ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయ్యన్న ఇంటికి వెళ్లే దారులను పోలీసులు మూసివేశారు. మీడియాను కూడా పరిసరాల్లోకి రాకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించిన అనంతరం ఇంటి గోడను కూల్చేశారు.

పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉన్న ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ వెంటనే గోడను కూలగొట్టడం ఏంటని అయ్యన్న కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. గోడ కూల్చివేత, పోలీసుల మోహరింపుతో నర్సీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News