Andhra Pradesh: ఏపీ ఇంటర్​ ఫస్టియర్​ అడ్మిషన్ల షెడ్యూల్​ వచ్చింది.. చివరి తేదీ ఎప్పుడంటే

andhra pradesh inter board release first year admission schedule

  • జూన్ 20 నుంచి దరఖాస్తులు మొదలు
  • జూన్ 27 నుంచి జులై 20వ తేదీ వరకు అడ్మిషన్లు
  • జులై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం

తెలంగాణ కంటే ముందే పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం (2022-23) ఇంటర్మీడియట్ మొదటి ఏడాది ప్రవేశాలను ఈ నెలలోనే ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కళాశాలల్లో తొలి ఏడాది ప్రవేశాల కోసం షెడ్యూల్ ను విడుదల చేసింది. 

ఈ నెల 20వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు మొదలవుతాయని చెప్పింది. దరఖాస్తుల స్వీకరణకు జులై 20ని ఆఖరి తేదీగా నిర్ణయించింది. జూన్ 27 నుంచి అడ్మిషన్లు మొదలు పెట్టి.. జులై 20వ తేదీతో పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. జులై ఒకటవ తేదీ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపింది. 

కాగా, ఈ నెల తొలి వారంలో విడుదలైన ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 4 లక్షల 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

  • Loading...

More Telugu News