rishab pant: అదృష్టమంటే పంత్​ దే... టీ20 సిరీస్​లో ఫెయిలైనా మరో కీలక పదవి!

Rishabh pant to be named vice captain for england test despite failure in SA series
  • టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ గా పంత్
  • ఇంగ్లండ్ తో ఏకైక టెస్టులో బాధ్యతలు
  • కేఎల్ రాహుల్ లేకపోవడంతో సెలక్టర్ల నిర్ణయం!
టీమిండియాలో ఇప్పుడు వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ హవా నడుస్తోంది. అతను పట్టిందల్లా బంగారం కాకపోయినా.. అదృష్టం మాత్రం నీడలా వెంటే వస్తోంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గా భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన అతనికి మరో కీలక బాధ్యత అప్పగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. 

వాస్తవానికి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ, షమీ, బుమ్రా విశ్రాంతి తీసుకోవడంతో ముందుగా కేఎల్ రాహుల్ ను ఈ సిరీస్ కు కెప్టెన్ గా ఎంపిక చేశారు. కానీ, ప్రాక్టీస్ సమయంలో గాయం అవ్వడంతో రాహుల్ కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దాంతో, రిషబ్ పంత్ కు టీ20 కెప్టెన్సీ అప్పగించారు. జట్టులో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్లు ఉన్నా.. పంత్ కు నాయకత్వం ఇవ్వడంపై ముందు నుంచే విమర్శలు వచ్చాయి. పైగా, ఈ సిరీస్ లో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ పంత్ బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశ పరిచాడు. అతని కెప్టెన్సీ కూడా ఏమంత బాగాలేదని మాజీలు విమర్శించారు. 

ఈ విమర్శలను జాతీయ సెలక్టర్లు, భారత టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదు. వచ్చే నెల ఇంగ్లండ్ తో జరిగే ఏకైక టెస్టులో పోటీపడే భారత టెస్టు జట్టుకు రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించాలని భావిస్తున్నాయి. కోహ్లీ నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మకు టెస్టు కెప్టెన్సీ ఇచ్చిన సెలక్టర్లు కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. కానీ, గాయం కారణంగా ఈ మ్యాచ్ కు కూడా కేఎల్ రాహుల్ దూరంగా ఉండటం పంత్ పాలిట వరమైంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లో ఆటగాడిగా, నాయకుడిగా అతని వైఫల్యాన్ని పట్టించుకోకుండా వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని, ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన వస్తుందని సమాచారం. ఏదేమైనా అదృష్టమంటే పంత్ దే అనొచ్చు.
rishab pant
Team India
vice captain
Rohit Sharma
england tour
test match
kl rahul
bhuvaneswar kumar
hardik pandya
t20 series

More Telugu News