Telangana: తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
- ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- 2,558 మంది ఉద్యోగులకు ప్రయోజనం
- ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబిత ఆదేశం
తెలంగాణలో ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్)లకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అనుమతి ఇచ్చింది. పరస్పర బదిలీల కింద ఉపాధ్యాయులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే... విద్యా శాఖలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారమే ఆదేశాలు జారీ చేశారు.
పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. విద్యా శాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇక ఉద్యోగుల పరస్పర బదిలీలకు కూడా త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.