Election Commission: ఎన్నికల సంఘం జాబితా నుంచి మరో 111 రాజకీయ పార్టీల తొలగింపు ... కారణాన్ని వివరించిన ఈసీ

111 more political parties deleted from eci list

  • ఈసీ జాబితా నుంచి 111 పార్టీల అవుట్‌
  • విరాళాల వివ‌రాలు అంద‌జేయ‌క‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ట‌
  • కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క ప్ర‌క‌ట‌న‌

దేశంలోని ప‌లు రాజ‌కీయ పార్టీలను ఇటీవ‌లే తమ జాబితా నుంచి తొలగించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా సోమ‌వారం కూడా మ‌రికొన్ని పార్టీల‌పై కొర‌ఢా ఝుళిపించింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు చెందిన 111 నమోదైన గుర్తింపుపొందని రాజ‌కీయ పార్టీలను త‌మ జాబితా నుంచి తొల‌గిస్తున్న‌ట్లు క‌మిష‌న్ స్ప‌ష్టం చేసింది.

 ఆయా పార్టీల‌కు వ‌చ్చిన విరాళాలు, చందాల‌ను పార్టీలు ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేయాల్సి ఉంది. అయితే ఆ దిశ‌గా ఈ 111 పార్టీలు న‌డుచుకోలేద‌ట‌. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ నుంచి నోటీసులు వ‌చ్చినా కూడా ఈ పార్టీలు స్పందించ‌లేదు‌. దీంతో 111 పార్టీలను జాబితా నుంచి తొలగిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • Loading...

More Telugu News