Muzaffarnagar: యూపీలో దారుణం.. ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని బాలిక హత్య

Teen Killed In UP For Not Accepting Friend Request On Facebook
  • ముజఫర్‌నగర్‌లో ఘటన
  • పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చి బాలికపై దాడి
  • అడ్డుకునేందుకు వచ్చిన తల్లిపైనా దాడి
  • ఆపై తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నం
ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదన్న కోపంతో ఓ బాలిక (16)ను దారుణంగా హత్య చేశాడో యువకుడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే  యువకుడు రవి.. పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి నాగ్లా బోహ్రా గ్రామంలోని బాధిత బాలిక ఇంటికి వెళ్లాడు. కార్డు తీసుకొనేందుకు వచ్చిన బాలికపై ఒక్కసారిగా కత్తితో దాడిచేశాడు. అది చూసి అప్రమత్తమైన బాలిక తల్లి అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమెపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి కూడా గాయపడింది. 

అనంతరం నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్‌లో అతడి రిక్వెస్ట్‌ను తన కుమార్తె అంగీకరించలేదన్న కోపంతోనే నిందితుడు ఆమెపై దాడిచేసి హత్య చేసినట్టు బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితుడితోపాటు బాలిక తల్లి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Muzaffarnagar
Uttar Pradesh
Facebook
Crime News

More Telugu News