rare tea: ఈ అస్సాం టీ ఖరీదు కిలో రూ.లక్ష

Rare Assam tea sold for Rs 1 lakh per kg

  • ప్రయోగాత్మకంగా పభోజన్ తేయాకు సాగు
  • నాణ్యమైన ప్రీమియం తేయాకు ఇది
  • కిలోకు రూ.లక్ష పెట్టి కొన్న అసోం కంపెనీ

పభోజన్ గోల్డ్ టీ. అసోంకి చెందిన ఆర్గానిక్ తేయాకు ఇది. అరుదైన రకం కూడా. అసోంలోని గోలాఘాట్ జిల్లాలో దీన్ని మొదటిసారి ప్రయోగాత్మకంగా ఒక కిలో మాత్రమే పండించారు. సోమవారం ఈ తేయాకును రూ.లక్ష చొప్పున (కిలో) విక్రయించారు. జోర్హాట్ లోని వేలం కేంద్రంలో విక్రయం జరిగింది. అసోంకు చెందిన ‘ఎసాహ్ టీ’ బ్రాండ్.. పభోజన్ తేయాకును కిలో లక్ష రూపాయలకు కొనుగోలు చేసినట్టు జోర్హాట్ టీ వేలం కేంద్రం అధికారి ఒకరు తెలిపారు.

పభోజన్ టీ పొడితో తయారయ్యే టీ పసుపు రంగులో ప్రకాశవంతంగా ఉంటుంది. కోసిన తర్వాత తేయాకు సహజసిద్ధంగా బంగారు వర్ణంలోకి మారిపోయి, టీకి మంచి రంగునిస్తుంది. అసోంకు చెందిన అత్యంత నాణ్యమైన టీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు అందించడానికి వీలుంటుందని ఎసాహ్ టీ సీఈవో బిజిత్ శర్మ తెలిపారు. 

పభోజన్ ఆర్గానిక్ టీ ఎస్టేట్ యజమాని రాఖీదత్తా మాట్లాడుతూ.. తాము కేవలం ఒక కిలో మాత్రమే పండించినట్టు చెప్పారు. రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రీమియం క్వాలిటీ టీకి డిమాండ్ ఉండడంతో ఈ రకాన్ని మొదటిసారి పండించారు.

  • Loading...

More Telugu News