Samantha Ruth Prabhu: నాగచైతన్యకు వ్యతిరేకంగా దుష్ప్రచారం.. స్పందించిన సమంత

Samantha Ruth Prabhu denies allegations of spreading rumours about ex husband Naga Chaitanya
  • నటి శోభిత దూళిపాళ్లతో చైతూ డేటింగ్ అంటూ వదంతులు
  • ఇదంతా సమంత పీఆర్ బృందం పనేనని చైతూ అభిమానుల ఆరోపణలు
  • ఘాటుగా బదులిచ్చిన సమంత
అక్కినేని నాగచైతన్యకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతున్నట్టు వస్తున్న వార్తలపై నటి సమంత స్పందించింది. సమంత నాగచైతన్యతో విడిపోయి, సినిమాలపై ఫోకస్ పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో నాగ చైతన్య నటి శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ వదంతుల వెనుక సమంత పీఆర్ (ప్రజా సంబంధాలను చూసే) బృందం ఉందని, వారే కావాలని ఇదంతా చేయిస్తున్నట్టు నాగచైతన్య అభిమానులు ఆరోపిస్తున్నారు.

ఈ వార్తల పట్ల సమంత స్పందిస్తూ.. మానసికంగా ఎదగాలంటూ, తమ సొంత పనిపై దృష్టి పెట్టాలంటూ ఘాటుగా సూచించింది. ‘‘అమ్మాయిపై వస్తున్న పుకార్లు నిజం కావాలి!! అబ్బాయిపై పుకార్లు మాత్రం ఓ అమ్మాయి పుట్టించినవి!! అబ్బాయిలూ ఎదగండి. మీ పని, మీ కుటుంబాలపై దృష్టి సారించండి’’ అని సమంత తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ పెట్టింది.  

నాగచైతన్య ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారాన్ని చర్చకు తీసుకు రావడం ఇదే మొదటిసారి. నాగచైతన్య ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటివి చేస్తున్నారంటూ అభిమానులు ఆరోపిస్తున్నారు. 

Samantha Ruth Prabhu
Naga Chaitanya
romours
dating
actor sobitha

More Telugu News