Y Sathish Reddy: తెలంగాణ రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వై.స‌తీశ్ రెడ్డి నియామ‌కం

trs social media convener appointed as telangana renewable energy deevelopment corporation chairman
  • టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్న‌ స‌తీశ్ రెడ్డి
  • టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడి హోదాలో ఉన్న‌ అనిల్ కూర్మాంచ‌లం
  • ఫిల్మ్‌, టెలివిజ‌న్‌, థియేట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నియామ‌కం
  • నియామ‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం
తెలంగాణ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం రెండు కీల‌క ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీటిలో తెలంగాణ రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా వై.స‌తీశ్ రెడ్డిని నియ‌మించింది. టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్‌గా కొన‌సాగుతున్న స‌తీశ్ రెడ్డికి తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వి ద‌క్కిన‌ట్టయింది. 

ఇక టీఆర్ఎస్ ఎన్నారై సెల్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న అనిల్ కూర్మాంచ‌లం.. తెలంగాణ అసోసియేష‌న్ ఇన్ యూకే పేరిట మ‌రో సంస్థ‌ను కూడా ఏర్పాటు చేశారు. అనిల్‌ను తెలంగాణ స్టేట్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్‌, థియేట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Y Sathish Reddy
TRS Social Media Convenor
Anil Kurmachalam
NRI TRS CELL
Telangana Association of UK

More Telugu News