Sonet: అమ్మకాల్లో మరో మైలురాయిని దాటిన కియా సోనెట్

KIA Sonet crosses 150 thousand number

  • 2020లో మార్కెట్లోకి వచ్చిన సోనెట్
  • ఇప్పటిదాకా 1.5 లక్షల యూనిట్ల అమ్మకం
  • కియా అన్ని మోడళ్ల అమ్మకాల్లో సోనెట్ వాటా 32 శాతం
  • సెల్టోస్ తర్వాతి స్థానంలో సోనెట్

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా భారత్ లో కాలుమోపిన కొన్ని సంవత్సరాల్లోనే గణనీయమైన పురోగతి సాధించింది. సెల్టోస్, సోనెట్, కార్నివాల్, కరెన్స్ వంటి మోడళ్లతో కియా భారత మార్కెట్ లో తన వాటా పెంచుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. 

ఈ క్రమంలో కియా సోనెట్ అమ్మకాల పరంగా మరో మైలురాయిని అధిగమించింది. దేశంలో ఇప్పటిదాకా అమ్ముడైన కియా సోనెట్ కార్ల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ యూవీ 2020 సెప్టెంబరులో భారత విపణిలో అడుగుపెట్టింది. కియా అన్ని మోడళ్ల విక్రయాల్లో సోనెట్ వాటా 32 శాతం అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సెల్టోస్ తర్వాత అత్యధికంగా అమ్మకాలు నమోదు చేస్తున్న మోడల్ ఇదే. మార్కెట్లోకి వచ్చిన 9 నెలల్లోనే ఇది లక్ష మార్కు చేరుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News