COVID19: దేశంలో పెరిగిన కరోనా కేసులు.. తగ్గిన మరణాలు

India reports 12249 new COVID cases 13 deaths

  • కొత్తగా 12, 249 కేసులు
  • 24 గంటల్లో 13 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసులు 81, 687

దేశంలో రోజువారీ కరోనా కేసులు మళ్లీ 12 వేలు దాటాయి. గత 24 గంటల్లో కొత్తగా 12,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 13 మంది చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొన్న 9,923 కొత్త కేసులు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 12 వేలకు చేరుకోవడం గమనార్హం. అయితే, మరణాల సంఖ్య మాత్రం కొద్దిగా తగ్గింది. మొన్న 17 మంది మృతి చెందారు. 

కాగా, దేశంలో ప్రస్తుతం 81, 687 యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.94 శాతంగా ఉంది. కరోనా నుంచి తాజాగా 9,682 మంది కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. దాంతో, దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,25,055కి చేరుకుంది. 

 భారత్ లో ఇప్పటిదాకా 196.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. 12-14 మధ్య వయస్కులకు కొవిడ్ వ్యాక్సినేషన్ మార్చి 16న మొదలవగా.. ఆ వయసు గల వారిలో ఇప్పటిదాకా 3 కోట్ల 58 లక్షల 99 వేల 199 మందికి మొదటి డోసు ఇచ్చారు.

  • Loading...

More Telugu News