Samantha: అక్షయ్ కుమార్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరవనున్న సమంత!

Samantha reportedly will attend Koffee With Karan along with Akshay Kumar
  • త్వరలో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ ప్రారంభం
  • సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ లతో తొలి ఎపిసోడ్
  • డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం
జాతీయస్థాయిలో బుల్లితెరపై ప్రజాదరణ పొందిన కార్యక్రమాల్లో 'కాఫీ విత్ కరణ్' ఒకటి. ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహర్ హోస్ట్ గా వ్యవహరించే ఈ కార్యక్రమానికి ఇప్పటిదాకా అనేకమంది సెలబ్రిటీలు హాజరై అలరించారు. తాజాగా, 'కాఫీ విత్ కరణ్' ఏడో సీజన్ ప్రారంభం కానుంది. కొత్త సీజన్ తొలి ఎపిసోడ్ జులై 7న డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది. ప్రారంభ ఎపిసోడ్ కు సారా అలీ ఖాన్, జాన్వి కపూర్ హాజరుకానున్నారు. 

కాగా, ఈ షోకి దక్షిణాది ముద్దుగుమ్మ సమంత కూడా హాజరుకానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి 'కాఫీ విత్ కరణ్'లో సందడి చేయనుంది. అయితే ఈ జోడీ టాక్ షోకి వస్తారన్నదానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించే కరణ్ జొహార్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా ఎంతో లోతైన ప్రశ్నలు అడుగుతాడని గత సీజన్ల ద్వారా వెల్లడైంది. మరి సమంత నుంచి ఎలాంటి జవాబులు రాబడతాడన్నది ఆసక్తి కలిగించే అంశం.
Samantha
Koffee With Karan
Akshay Kumar
Karan Johar

More Telugu News