Nagachaitanya: కృతి శెట్టి మరో ఛాన్స్ కొట్టేసిందే!

Krithi Shetty in Venkat Prabhu Movie
  • ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన కృతి శెట్టి 
  • రిలీజ్ కి రెడీగా ఉన్న మరో మూడు సినిమాలు 
  • చైతూతో కలిసి మరోసారి రొమాన్స్ 
  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా  
కృతి శెట్టి అందగత్తె మాత్రమే కాదు .. అదృష్టవంతురాలు కూడా. తెలుగు తెరకి పరిచయమవుతూనే వరుస అవకాశాలను అందుకుంది .. చాలా తేలికగా హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ఆమె నుంచి రావడానికి మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. 

ఆ జాబితాలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'ది వారియర్' .. ' మాచర్ల నియోజకవర్గం' సినిమాలు కనిపిస్తాయి. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదిలోనే రానుండటం విశేషం. ఈ నేపథ్యంలోనే ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్  ఇచ్చేసింది. అది నాగచైతన్య సినిమా కావడం .. తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతుండటం విశేషం. 

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ఆ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. 'బంగార్రాజు' తరువాత చైతూ .. కృతి కలుసు నటిస్తున్న సినిమా ఇది..
Nagachaitanya
Krithi Shetty
Venkat Prabhu Movie

More Telugu News