Gujarat Riots: గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి క్లిన్ చిట్ కు సుప్రీం సమర్థన.. పిటిషన్ తిరస్కరణ

Gujarat Riots Supreme Court Confirms Clean Chit To PM Dismisses Appeal

  • తాజా దర్యాప్తు కోరుతూ దివంగత కాంగ్రెస్ ఎంపీ భార్య పిటిషన్
  • అర్హత లేదంటూ పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • లోగడ సుప్రీంకోర్టు నియమిత సిట్ నుంచి క్లీన్ చిట్

2022 గుజరాత్ అల్లర్లలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నేటి ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. క్లీన్ చిట్ ను వ్యతిరేకిస్తూ నాటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. 

సుప్రీంకోర్టు నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నాటి అల్లర్లపై దర్యాప్తు నిర్వహించి మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. నాడు అల్లర్ల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ జాఫ్రీ సహా 68 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రాలో సాధువులతో వెళుతున్న రైలు కోచ్ కు దుండగులు నిప్పు పెట్టడం.. 59 మంది సాధువులు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. దీంతో నాడు పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 

నాటి మత ఘర్షణలపై తాజా దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని జకియా జాఫ్రీ సుప్రీంకోర్టును కోరారు. దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటూ, రాజకీయ నాయకులు, పోలీసుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాజా దర్యాప్తునకు ఎటువంటి ఆధారాల్లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సిట్ 2012 ఫిబ్రవరిలో దర్యాప్తు ముగింపు నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడమే కాకుండా.. మోదీతోపాటు మరో 63 మందికి సంబంధించి ఎటువంటి ఆధారాల్లేవని పేర్కొంది.

  • Loading...

More Telugu News