Andhra Pradesh: కోన‌సీమ జిల్లా ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా... ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

ap cabinet approves new name for konaseema district

  • కొత్త రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల‌కూ ఆమోదం
  • జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఉత్త‌ర్వుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌
  • వంశ‌ధార నిర్వాసితుల‌కు రూ.216 కోట్ల ప‌రిహారానికి కేబినెట్ ఓకే

ఏపీలో అమ‌లాపురం కేంద్రంగా కొత్త‌గా ఏర్పాటైన కోన‌సీమ జిల్లా పేరును ఇక‌పై అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా ప‌రిగ‌ణిస్తారు. ఈ మేర‌కు శుక్ర‌వారం అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో భేటీ అయిన ఏపీ కేబినెట్ జిల్లా పేరు మార్పున‌కు సంబంధించి ఆమోద ముద్ర వేసింది. కోన‌సీమ జిల్లా పేరు మార్పుతో పాటు రాష్ట్రంలో కొత్త‌గా మ‌రికొన్ని రెవెన్యూ డివిజ‌న్లు, మండ‌లాల కూర్పున‌కు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన కేబినెట్ దాదాపుగా రెండున్నర గంట‌ల పాటు స‌మావేశ‌మైంది.

ఇక క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు అవ‌స‌రమైన ఉత్త‌ర్వుల‌కు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అమ్మ ఒడి నిధుల విడుద‌ల‌తో పాటుగా జులైలో అమ‌లు చేయ‌నున్న 4 సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించిన నిధుల విడుద‌ల‌కూ కేబినెట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వంశ‌ధార ప్రాజెక్టు నిర్వాసితుల‌కు రూ.216 కోట్ల మేర ప‌రిహారం ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

  • Loading...

More Telugu News