Sahitya Akademi: తెలుగు రచయిత్రి సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
- తెలుగు అనువాద రచనల విభాగంలో సజయకు అవార్డు
- హిందీ పుస్తకం అదృశ్య భారత్‌ను అశుద్ధ భారత్‌గా అనువదించిన సజయ
- అవార్డు కింద రూ.50 వేలు, ప్రశంసా పత్రం అందజేత
తెలుగు నేలకు చెందిన సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. అనువాద రచనల్లో భాగంగా ఆమెకు అకాడమీ అవార్డు దక్కింది. దేశవ్యాప్తంగా పాకీ పని చేసే వారి జీవన స్థితిగతులను వివరిస్తూ ప్రముఖ హిందీ జర్నలిస్టు, రచయిత్రి భాషా సింగ్ రాసిన అదృశ్య భారత్ అనే పుస్తకాన్ని సజయ తెలుగులోకి అనువదించారు.
అశుద్ధ భారత్ పేరిట ఈ పుస్తకాన్ని తర్జుమా చేసిన సజయను తెలుగు అనువాద రచనల్లో భాగంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర సాహిత్య అకాడమీ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఈ అవార్డు కింద సజయకు రూ.50 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రం అందనున్నాయి.