mumbai: ముంబైలో 144 సెక్షన్ విధింపు
- శివసేనలో ప్రకంపనలు పుట్టిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు
- రెబెల్స్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
- ఏక్ నాథ్ షిండే నివాసం వద్ద భద్రత పెంపు
మహారాష్ట్రలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసైనికులు రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల రెబెల్స్ ఇళ్లు, కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. వారి ఫ్లెక్సీలను చింపేయడంతో పాటు దిష్టిబొమ్మలను దహనం చేశారు.