Sushil P Mantri: మంత్రి డెవలపర్స్ డైరెక్టర్ సుశీల్ అరెస్ట్... 10 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి
- పీఎంఎల్ఏ కింద సుశీల్‌పై 2002లో కేసు
- రూ.5 వేల కోట్ల రుణం ఎగవేసినట్లుగా ఆరోపణలు
- సుశీల్‌ను కోర్టులో హాజరు పరచిన ఈడీ అధికారులు
- కోర్టు అనుమతితో 10 రోజుల పాటు ఆయనను ప్రశ్నించనున్న ఈడీ
దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా కొనసాగుతున్న మంత్రి డెవలపర్స్ డైరెక్టర్ సుశీల్ పీ మంత్రిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థపై 2002లో రూ.5 వేల కోట్ల మేర రుణం ఎగవేసినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.
పీఎంఎల్ఏ సెక్షన్ల కింద నమోదు చేసిన ఈ కేసులో కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో సుశీల్‌ను హాజరుపరచిన ఈడీ అధికారులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈడీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు సుశీల్‌ను 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.