Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ గదిలో నిఘా పరికరం పెట్టేందుకు ప్రయత్నం.. ఉద్యోగి అరెస్టు

Former Pak PM Imran Khans staff caught trying to spy on him

  • మాజీ ప్రధాని ఇమ్రాన్  హత్యకు కుట్ర చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణ
  • భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
  • ఈ మధ్యే పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌ హత్యకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసంలో గూఢచర్య ప్రయత్నాన్ని భద్రతా సిబ్బంది తిప్పికొట్టారు. ఇమ్రాన్ ఖాన్ నివాసంలో ఓ ఉద్యోగి ఆయనపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇమ్రాన్ గదిలో ఓ నిఘా పరికరాన్ని అమర్చేందుకు ప్రయత్నించి భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. ఇస్లామాబాద్ బని గాలా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇమ్రాన్ గదిని శుభ్రం చేసేందుకు వచ్చి ఓ రహస్య పరికరాన్ని అమర్చుతున్నాడని మరో ఉద్యోగి భద్రతా బృందానికి సమాచారం ఇచ్చాడు. దాంతో, మాజీ ప్రధానిపై  గూఢచర్యం ప్రయత్నం విఫలమైంది. బని గాలా నుంచి వచ్చిన వ్యక్తిని భద్రతా బృందం అదుపులోకి తీసుకొని ఫెడరల్ పోలీసులకు అప్పగించింది. 

ప్రధాని పదవి నుంచి దిగిపోయిన ఇమ్రాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే ఆరోపణల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. దాంతో, ఇస్లామాబాద్, ఇమ్రాన్ నివాస ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇమ్రాన్‌  ప్రాణాలకు ముప్పు ఉందని పీటీఐకి చెందిన పలువురు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తాము ప్రభుత్వంతో సహా అన్ని సంబంధిత ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. ‘మా అధినేత  గదిని శుభ్రపరిచే ఉద్యోగికి గూఢచారి పరికరాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి డబ్బు ఇచ్చారు. ఇది చాలా హీనమైన చర్య. కొంతమంది సమాచారం కోసం మా మనుషులను బెదిరిస్తున్నారు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవాలి’ అని పీటీఐ నాయకుడు షెహబాజ్ గిల్ అన్నారు.

  • Loading...

More Telugu News