YSRCP: ఏపీ సీఎం జగన్‌తో సంభాషించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
- ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన ముర్ము
- ముర్ముకు మద్దతు ప్రకటించిన వైసీపీ
- ఢిల్లీ నుంచి జగన్‌తో సంభాషించిన ముర్ము
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార పక్షం ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము ఆదివారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సంభాషించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ తన మద్దతును ఎన్డీఏ అభ్యర్థికి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముర్ము నామినేషన్ పత్రాలపై వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు సంతకాలు చేశారు.
ఇప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన ముర్ము... దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆదివారం జగన్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌పై వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు మద్దతు ప్రకటించిన జగన్‌కు ముర్ము కృతజ్ఞతలు తెలిపారు.