Sensex: వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 433 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 132 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 2.69 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. టెక్నాలజీ, మెటల్ స్టాకులు మార్కెట్లను ముందుండి నడిపించాయి. శుక్రవారంనాడు వాల్ స్ట్రీట్ లాభపడటం, ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 433 పాయింట్లు లాభపడి 53,161కి చేరుకుంది. నిఫ్టీ 132 పాయింట్లు పెరిగి 15,832కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.
ఎల్ అండ్ టీ (2.69%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.61%), టెక్ మహీంద్రా (2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.27%), ఇన్ఫోసిస్ (2.25%).
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.41%), రిలయన్స్ (-0.35%), టైటాన్ (-0.07%).