Telangana: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌.. నేడు ప్రారంభించనున్న కేసీఆర్

CM KCR Today Opens worlds largest startups incubator T Hub

  • రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రూ. 276 కోట్లతో పది అంతస్తుల్లో నిర్మాణం
  • నాలుగు వేల సంస్థలకు పైగా స్పేస్
  • విద్యుద్దీపాలతో మెరిసిపోతున్న భవనం

ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రూ. 276 కోట్లతో దీనిని నిర్మించారు. మూడు ఎకరాల్లో 53.65 మీటర్ల ఎత్తులో నిర్మించిన  ఈ భవనంలో 10 అంతస్తులున్నాయి. 4 వేలకు పైగా సంస్థలు ఇందులో కొలువుదీరేలా తీర్చిదిద్దారు. సాయంత్రం ఐదు గంటలకు కేసీఆర్ ఈ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, సైయింట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీహబ్‌ సీఈవో శ్రీనివాసరావు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ కూ యాప్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుండగా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరోమోటార్స్, ఫొంటాక్, వెబ్3 సంస్థలతో టీహబ్‌ ఒప్పందాలు చేసుకోనుంది. కాగా, టీహబ్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని భవనాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

  • Loading...

More Telugu News