Deepak Reddy: గిన్నిస్ రికార్డుల్లోకి తెలుగు షార్ట్ ఫిల్మ్.. అడివిశేషు, సుకుమార్ అభినందనలు

Adivi Sesh and Sukumar praise director Deepak as his Telugu short film Manasanamaha enters Guinness Records

  • మనసా నమహకు ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు
  • ప్రపంచంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ ఇదే
  • గుర్తించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

దీపక్ రెడ్డి అనే కుర్రాడు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘మనసా నమహ’ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను గెలుచుకుంటోంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 513 అవార్డులు వరించాయి. దీంతో ప్రపంచంలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిల్మ్ గా దీన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. గిన్నిస్ సర్టిఫికెట్ ఫోటోను దీపక్ రెడ్డి తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

దీంతో మనసా నమహ సినిమాను తీసిన దీపక్ రెడ్డికి సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మేజర్ సినిమా దర్శకుడు, నటుడు అడవిశేషు, పుష్ప సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ సైతం ఈ ఘనత సాధించినందుకు దీపక్ రెడ్డిని అభినందించారు. ‘నీవు ఫీచర్ ఫిల్మ్ తో ప్రపంచాన్ని షేక్ చేసే వరకు నేను వేచి చూడలేకపోతున్నాను’’అని అడవిశేషు పేర్కొన్నాడు. మనసా నమహ అన్నది రొమాంటిక్ కామెడీ కథనంతో సాగే ఫిల్మ్. 

  • Loading...

More Telugu News