Telangana: టీహబ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
- రాయదుర్గం పరిధిలో టీహబ్-2
- రూ.276 కోట్లతో నిర్మించిన తెలంగాణ ప్రభుత్వం
- ప్రారంభోత్సవానికి హాజరైన కేటీఆర్
హైదరాబాద్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న టీహబ్- 2ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఆ శాఖ అధికారులు, పలు స్టార్టప్‌ల అధినేతలు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా టీహబ్- 2కు సంబంధించిన ప్రత్యేకతలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ సెంటర్‌గా టీహబ్ గుర్తింపు సాధించిందని తెలిపారు.
హైదరాబాద్‌లోని రాయదుర్గం పరిధిలో రూ.276 కోట్లతో నిర్మితమైన టీహబ్-2లో ఒకేసారి 2 వేల స్టార్టప్‌లు కార్యకలాపాలు సాగించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే అత్యధిక సంఖ్యలో నూతన ఆవిష్కరణలకు ఇందులో అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.