Andhra Pradesh: మ‌రో రూ.3 వేల కోట్లు అప్పు తెచ్చిన ఏపీ ప్ర‌భుత్వం

ap government takes new loan of 3000 crores

  • 7.95 శాతం వ‌డ్డీకి తాజా రుణం
  • కేంద్రం అనుమ‌తించిన రుణ ప‌రిమితిలోనే కొత్త అప్పు
  • రిజ‌ర్వ్ బ్యాంక్ సెక్యూరిటీ వేలం ద్వారా రుణ సేక‌ర‌ణ‌

ఏపీ ప్ర‌భుత్వం మంగ‌ళ‌వారం మ‌రో రూ.3 వేల కోట్ల అప్పు తీసుకుంది. ప్ర‌తి మంగ‌ళ‌వారం రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వ‌ర్యంలో సెక్యూరిటీ బాండ్ల వేలం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం నాటి సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న ఏపీ ప్ర‌భుత్వం రూ.3 వేల కోట్ల‌ను రుణంగా తీసుకుంది. 

ఈ కొత్త రుణాన్ని ఏపీ ప్ర‌భుత్వం 7.95 శాతం వ‌డ్డీకి సేక‌రించింది. ఈ రుణాన్ని కేంద్రం అనుమ‌తించిన రుణ ప‌రిమితి నుంచే రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించింది. ఇదిలా ఉంటే... గ‌త మంగ‌ళ‌వారం కూడా రిజ‌ర్వ్ బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.2 వేల కోట్ల రుణాన్ని సేక‌రించింది.

  • Loading...

More Telugu News