Governor: చదువు పూర్తయ్యే వరకు ఆగొద్దు.. వయసులో ఉన్నప్పుడే పెళ్లాడండి: వైద్య విద్యార్థులకు గవర్నర్ తమిళిసై సూచన

TS Governor asks medicos to get marry as early as possible
  • ఎయిమ్స్‌లో స్కిల్‌ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించిన గవర్నర్
  • మెడిసిన్ మొదటి సంవత్సరంలో ఉండగానే తనకు పెళ్లయిందన్న తమిళిసై
  • అయినా మంచి మార్కులతో పాసయ్యానన్న గవర్నర్
‘‘నేను మెడిసిన్ మొదటి  సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లులు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’’.. ఈ మాటలన్నది ఎవరో కాదు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్‌ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేశారు. గవర్నర్ నిన్న దీనిని ప్రారంభించారు. అలాగే, ఆపరేషన్ స్వస్త, అనుసంధాన్ పత్రికలను ఆవిష్కరించారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నపుడే తనకు వివాహమైందని, అయినప్పటికీ అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో పాసైనట్టు గుర్తు చేసుకున్నారు. కాబట్టి వయసులో ఉండగానే వివాహం చేసుకోవాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు.
Governor
Tamilisai Soundararajan
Bibinagar AIIMs
Telangana

More Telugu News