Rajasthan: ఇలాంటివి జరగాల్సింది కాదు.. నుపుర్​ శర్మనూ అరెస్టు చేయాలి: అసదుద్దీన్​ ఒవైసీ

radicalisation is spreading says asaduddin owaisi on udaipur murder

  • ఉదయ్ పూర్ లో టైలర్ హత్యను ఖండించిన ఎంఐఎం నేత
  • హింసను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది లేదని వెల్లడి
  • నుపుర్ శర్మ వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలని ఆరోపణ

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో హిందూ టైలర్ ను ఇద్దరు దుండగులు తల నరికి హత్య చేయడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఇలాంటివి జరగాల్సింది కాదని పేర్కొన్నారు. భోపాల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉదయ్ పూర్ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజస్థాన్ ప్రభుత్వం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సింది. ఇలాంటి ఘటన జరిగి ఉండాల్సింది కాదు. దేశంలో తీవ్రవాదం విస్తరిస్తోంది..” అని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఇలాంటి హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎవరూ సమర్థించబోరని స్పష్టం చేశారు.

ఆమెను సస్పెన్షన్ తో వదిలి పెట్టడం సరికాదు..

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి వదిలి పెట్టడం సరికాదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆమెను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి ఘటనలకు నుపుర్ శర్మ వ్యాఖ్యలే కారణమయ్యాయని మండిపడ్డారు. 


  • Loading...

More Telugu News