Telangana: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు!
- ఉదయం 11.30 గంటలకు టెన్త్ రిజల్ట్స్
- ఫలితాలను విడుదల చేయనున్న సబితా ఇంద్రారెడ్డి
- పరీక్షా ఫలితాలను www.bse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు
తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్చార్డీలో జరగనుంది.
ఈ పరీక్షా ఫలితాలను www.bse.telangana.gov.in , www.bseresults.telangana.gov.in వెబ్ సైట్లలోకి వెళ్లి, చెక్ చేసుకోవచ్చు. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మందికి పరీక్షలను నిర్వహించగా... వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలను 11 పేపర్లకు బదులు 6 పేపర్లకు కుదించారు.