cylinder: తగ్గిన వాణిజ్య ఎల్ఫీజీ సిలిండర్ ధర.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందంటే..!
- వాణిజ్య సిలిండర్ పై రూ. 198 తగ్గించిన ప్రభుత్వం
- దేశ వ్యాప్తంగా అమలు
- హైదరాబాద్ లో 183 తగ్గుదల
వాణిజ్య వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొంత కాలంగా ప్రతి నెల సిలిండర్ ధరలు పెంచుతున్న కేంద్రం ఎట్టకేలకు ప్రజలకు ఊరట కలిగించింది. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించింది. అయితే, ఇది సాధారణ సిలిండర్లకు కాదు. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.198 తగ్గించింది. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2219 నుంచి రూ.2021కి పడిపోయింది.
తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో రూ.2426గా ఉన్న సిలిండర్ ధర రూ.2243కు చేరింది. హైదరాబాద్ లో ఒక సిలిండర్ పై ధర రూ.183.50 తగ్గింది. ఇక కోల్‌కతాలో రూ.182, ముంబైలో 190.5, చెన్నైలో రూ.187 మేర తగ్గాయి. కాగా, గత నెల 1న కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ.135 తగ్గిన విషయం తెలిసిందే. ఈ లెక్కన నెల వ్యవధిలోనే కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ. 400 పైచిలుకు తగ్గింది.