Twitter: ప్లాస్టిక్​ కవర్లు కాకుంటే ఏం వాడుదాం.. కేంద్ర ప్రభుత్వ సూచనలివీ

What should we use if not plastic covers Central government instructions

  • ట్విట్టర్ లో వినూత్న వీడియో పెట్టిన కేంద్రం
  • ఖాదీ సంచులు ఉపయోగిద్దామని పిలుపు
  • తిరిగి వినియోగించగల కప్పులు, గ్లాసులు వినియోగించాలి
  • కావాలంటే వెదురు స్ట్రాలు, కలపతో తయారైన చెంచాలు వాడాలని సూచన

సింగిల్ యూజ్ (ఒకసారి వినియోగించి పారేసే) ప్లాస్టిక్ పై నిషేధాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించి ఓ వినూత్న ప్రకటన వీడియోను విడుదల చేసింది. ప్లాస్టిక్ కు బదులుగా ఏమేం ఉపయోగించవచ్చో పేర్కొంటూ.. ట్విట్టర్ లో ఆ వీడియోను పోస్టు చేసింది. ‘సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్’, ‘సస్టెయినబుల్ గోల్స్’ హ్యాష్ ట్యాగ్స్ ను పెట్టింది. రోజువారీ జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు బదులుగా వీటిని ఉపయోగిస్తూ.. ప్లాస్టిక్ మహమ్మారి నియంత్రణకు తోడ్పడాలని పిలుపునిచ్చింది.
  • ఒకేసారి వినియోగించి పడేసే వస్తువుల్లో ప్లాస్టిక్ కు బదులు వెదురుతో రూపొందించిన స్ట్రాలు, చెంచాలు, స్టిర్రర్స్ వంటివి వినియోగించాలని సూచించింది.
  • తిరిగి వినియోగించగల స్టీలు, గాజు కప్పులు, గ్లాసులు వంటివి వినియోగించాలని కోరింది. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ స్ట్రాలు, చెంచాలు, లంచ్ బాక్సులు వాడాలని పేర్కొంది.
  • ప్లాస్టిక్ ఇయర్ బడ్స్ కు బదులు వెదురు వినియోగించి చేసిన ఇయర్ బడ్స్, లేదా ద్రవ రూపంలో ఉండే ‘ఇయర్ కేర్’ ఉత్పత్తులు వాడాలని సూచించింది.
  • ఇంటి నుంచి బజారుకు వెళ్లినప్పుడు ఏదైనా సంచీ తీసుకెళ్లాలని.. లేకుంటే ఖాదీ బ్యాగుల్లో నిత్యావసరాలను తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేసింది. 
  • ‘భారత దేశం సుస్థిర భవిష్యత్తు కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించింది. మీ జీవితంలోంచి ప్లాస్టిక్ ను దూరం పెట్టేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి’ అని కోరింది.

  • Loading...

More Telugu News