Narendra Modi: తెలంగాణ దోశకు మోదీ ఫిదా
- హైదరాబాదులో ముగిసిన బీజేపీ జాతీయ సమావేశాలు
- రెండ్రోజుల పాటు సమావేశాలు
- బీజేపీ నేతల కోసం భారీ మెనూ
- తెలంగాణ వంటకాలకు ప్రత్యేకస్థానం
హైదరాబాదులో రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరుకాగా, వారి కోసం ఇతర వంటకాలతో పాటు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను కూడా వండివార్చారు. కరీంనగర్ కు చెందిన యాదమ్మ బృందంతో నోవాటెల్ హోటల్ లో వంటకాలు తయారుచేయించారు.
కాగా, ప్రధాని మోదీ భోజన సమయంలో తెలంగాణ దోశను ప్రత్యేకంగా అడిగి మరీ తెప్పించుకున్నారు. ఆయన తెలంగాణ వంటకాలను బాగా ఇష్టపడినట్టు రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ వంటకాలతో పాటు ఈ కింది జాబితాలోని వంటకాలను కూడా బీజేపీ నేతలకు అందుబాటులో ఉంచారు.
ధోక్లా, పెరుగన్నం, గోంగూర రోటి పచ్చడి, వడియాలు, వెజ్ చీజ్ శాండ్ విచ్, అచారీ పనీర్ టిక్కా, కచుంబర్ సలాడ్, గ్రీన్ సలాడ్, క్యారెట్ రైజిన్ మఫిన్స్, ఆలూ బఠానా కుర్మా, దాల్ కిచిడీ, దాల్ మఖానీ, చపాతీ, నాన్ రోటీ, టమాటా పప్పు, గోంగూర ఊరగాయ, వడాపావ్-ఫ్రైడ్ చిల్లీ, పుదీనా చట్నీ, దివానీ సబ్జీ హండీ, డబుల్ కా మీఠా, బ్రెడ్ పకోడీ, బెల్లం జిలేబీ... ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేసిన నవరాత్రి ఫుడ్, వేరుశనగ కిచిడీ, వివిధ రకాల పండ్లు, బటర్ స్కాచ్ ఐస్ క్రీములు, ఆప్రికాట్ డిలైట్, డ్రైఫూట్ కేక్ తదితర వంటకాలు మెనూలో ఉన్నాయి.