Tirumala: తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను తాకిన తిరుమ‌ల హుండీ ఆదాయం

tirumala one day hundi income touches 6 crores for the first time

  • ఆదివారం నాటి హుండీ ఆదాయాన్ని లెక్కించిన టీటీడీ
  • రికార్డు స్థాయిలో రూ.6.18 కోట్లు వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ‌
  • తొలిసారి రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసిన వెంక‌న్న ఆదాయం
  • 2012 ఏప్రిల్ 1న వ‌చ్చిన రూ.5.73 కోట్లే ఇప్ప‌టిదాకా అత్య‌ధికం

తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామికి భ‌క్తులు స‌మ‌ర్పిస్తున్న కానుక‌లు సోమ‌వారం రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆదివారం ఒక్క‌రోజే ఏకంగా రూ.6 కోట్ల‌కు పైగా హుండీ ఆదాయం ల‌భించింది. ఈ మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తిరుమ‌ల చ‌రిత్ర‌లో ఇప్ప‌టిదాకా ఒక రోజులో ల‌భించిన అత్య‌ధిక హుండీ ఆదాయంగా ఆదివారం నాటి హుండీ ఆదాయం రికార్డుల‌కెక్క‌నుంది.

ఆదివారం తిరుమ‌ల వెంక‌న్న‌కు హుండీలో స‌మ‌ర్పించిన ఆదాయాన్ని టీటీడీ సోమ‌వారం లెక్కించింది. ఈ లెక్కింపులో ఆదివారం నాటి విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్ప‌టిదాకా తిరుమ‌ల వెంక‌న్న హుండీకి ఒక‌రోజు అత్య‌ధికంగా ల‌భించిన ఆదాయం రూ.5.73 కోట్లే. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న ల‌భించింది. ఆ త‌ర్వాత అంత‌కుమించిన ఆదాయం ఇప్ప‌టిదాకా ల‌భించ‌లేదు. తాజాగా తిరుమ‌ల చ‌రిత్ర‌లోనే వెంక‌న్న హుండీ ఆదాయం రూ.6 కోట్ల మార్క్‌ను దాటేసింది.

  • Loading...

More Telugu News