Nairobi Fly: పశ్చిమ బెంగాల్‌లో నైరోబీ ఈగల హల్‌చల్.. అనారోగ్యం బారినపడుతున్న జనం

Nairobi fly strikes burns skin in west bengal

  • సిలిగిరి, డార్జిలింగ్ ప్రాంతాల్లో నైరోబీ ఈగల వీర విహారం
  • ఈగల వల్ల వాంతులు, జ్వరం 
  • మూడు రంగుల్లో కనిపిస్తున్న ఈగలు
  • భయం వద్దంటున్న వైద్యులు

పశ్చిమ బెంగాల్‌ను ఇప్పుడు నైరోబీ ఈగ భయపెడుతోంది. వందలాదిమందిని అనారోగ్యం పాలు చేస్తోంది. నారింజ, ఎరుపు, నలుపు రంగులో ఉన్న ఈగలు మనుషులపై వాలితే విపరీతమైన మంట, నొప్పి ఉంటోందని బాధితులు చెబుతున్నారు. అంతేకాదు, జ్వరం రావడంతోపాటు వాంతులు కూడా అవుతున్నట్టు చెప్పారు. ఆఫ్రికాకు చెందిన ఈ ఈగలను యాసిడ్ ఫ్లై అని కూడా పిలుస్తారు. సిలిగురి, డార్జిలింగ్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇవి వీర విహారం చేస్తున్నాయి. 

అయితే, ఇవి అంత ప్రమాదకారి కావని, భయపడాల్సి అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. వీటిలో మానవ చర్మానికి హాని కలిగించే పెడిటిన్ అనే ఆమ్లం ఉంటుంది. ఉత్తరాదిలో హిమాలయాల దిగువన వర్షపాతం అధికంగా ఉండడంతో అవి అక్కడ తిరుగుతున్నాయి. నిజానికి ఇవి ఎవరినీ కుట్టవు. అయితే, అవి మనపై వాలినప్పుడు వాటిని చేతితో కొడితే మాత్రం రసాయనం లాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. తద్వారా చర్మంపై దద్దుర్లు రావడంతోపాటు ఆ తర్వాత అది అంటువ్యాధిలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News