WhatsApp: వాట్సాప్ లో కొత్తగా ‘ఫ్లాష్ కాల్స్’

WhatsApp new automatic verification method how it works and more
  • లాగిన్ ప్రక్రియ సులభతరం, వేగవంతం
  • మొబైల్ కు ఓటీపీ రాదు
  • వాట్సాప్ నుంచి మిస్డ్ కాల్
  • ధ్రువీకరణ తర్వాత ఆటోమేటిగ్గా లాగిన్
  • త్వరలో అందుబాటులోకి
వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుని లాగిన్ అవ్వాలనుకుంటే.. వెరిఫికేషన్ (ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నంబర్ నమోదు చేసిన తర్వాత వాట్సాప్ ఓటీపీ పంపడం, దాన్ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవడం తెలిసిందే. ఇకపై ఈ శ్రమ ఉండకుండా ఫ్లాష్ కాల్స్ ఫీచర్ ను వాట్సాప్ అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని వాట్సాప్ గురించి విశ్వసనీయ సమాచారాన్ని తీసుకొచ్చే వాబీటాఇన్ఫో బయట పెట్టింది. 

వాట్సాప్ త్వరలోనే ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల అకౌంట్ లాగిన్ చాలా సులభంగా, వేగంగా ఉంటుంది. యూజర్ స్వయంగా ఓటీపీని ఎంటర్ చేయక్కర్లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ కూడా రాదు. అయినా లాగిన్ పూర్తవుతుంది. యూజర్ ఇచ్చిన మొబైల్ నంబర్ కు వాట్సాప్ మిస్డ్ కాల్ ఇస్తుంది. అదే నంబర్ పై వాట్సాప్ లాగిన్ చేస్తున్నట్టు ధ్రువీకరణ చేసుకుని లాగిన్ పూర్తి చేస్తుంది. దీంతో ఈ కొత్త విధానంలో లాగిన్ వేగంగా జరిగిపోతుంది. దీనికంటే ముందు వాట్సాప్ కాల్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేసేందుకు అడిగిన అన్ని ‘పర్మిషన్స్’ ఇవ్వాల్సి ఉంటుంది.
WhatsApp
automatic verification
flash calls

More Telugu News