MS Dhoni: నేడు ధోనీ 41వ పుట్టినరోజు... నందిగామలో 41 అడుగుల భారీ కటౌట్
- దేశవ్యాప్తంగా ధోనీ జన్మదిన వేడుకలు
- ఏపీలోనూ సంబరాలు
- కటౌట్ ఏర్పాటు చేసిన తెలుగు ధోనీ ఫ్యాన్స్
- రిటైరైనా తగ్గని క్రేజ్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ భారత క్రికెట్ పై వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. మైదానంలో సాధించిన విజయాలు ఒకెత్తయితే, తన వ్యక్తిత్వంతో ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి కూడా గౌరవాభిమానాలు పొందడం మరో ఎత్తు. కెప్టెన్ కూల్ గా పేరొందిన ధోనీ రిటైర్ అయినప్పటికీ అతడి ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ఇవాళ ధోనీ 41వ పుట్టినరోజు జరుపుకుంటుండగా, అభిమానులు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఏపీలోనూ ధోనీ ఫ్యాన్స్ సంబరాలు మామూలుగా లేవు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద 41 అడుగుల ధోనీ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ధోనీ 41వ బర్త్ డేని పురస్కరించుకుని తెలుగు ధోనీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ కటౌట్ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాన్నాళ్లయినా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి ఇదే నిదర్శనం.
.