Peddireddi Ramachandra Reddy: కుప్పంలో అయినా, తంబళ్లపల్లెలో అయినా.. చంద్రబాబుపై పోటీకి నేను సిద్ధం: పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

Iam ready to contest against Chandrababu says Peddireddi Dwarakanath Reddy
  • పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చంద్రబాబు విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న ద్వారకానాథ్ 
  • మదనపల్లె మినీ మహానాడులో తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు చెప్పుకోలేక పోయారని విమర్శ 
  • నల్లారి కిశోర్ కుమార్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కనివ్వమని స్పష్టీకరణ 
తనపై పోటీ చేసి గెలవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సవాల్ విసిరారు. కుప్పంలో అయినా, తంబళ్లపల్లెలో అయినా చంద్రబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని.. చంద్రబాబు రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలంటూ ఛాలెంజ్ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబంపై చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు చెప్పుకోలేక.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులా సొంత వాళ్లను మోసం చేసి తాము పైకి రాలేదని, కష్టపడి పైకొచ్చామని అన్నారు. మినీ మహానాడుకు వెళ్లకుండా తాము ఎవరినీ అడ్డుకోలేదని చెప్పారు. నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేసినా... డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిస్తామని అన్నారు.
Peddireddi Ramachandra Reddy
Peddireddi Dwarakanath Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News