YS Vijayamma: వైసీపీకి వైఎస్ విజయమ్మ రాజీనామా.. పార్టీ నుంచి తప్పుకోవడానికి ప్లీనరీలో కారణం చెప్పిన విజయమ్మ!
- వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ ప్రకటన
- ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ఉంటానన్న విజయమ్మ
- తల్లిగా జగన్ కు తన మద్దతు ఉంటుందని వ్యాఖ్య
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పార్టీకి అండగా ఉన్నానని తెలిపారు. తన కూతురు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ పెట్టుకుందని, తన తండ్రి వైఎస్ ఆశయాలను సాధించేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. షర్మిలకు అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉంటానని అన్నారు.
ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన అండ అవసరమని చెప్పారు. తన కొడుకుని మీ అందరి చేతుల్లో పెడుతున్నానని తెలిపారు. తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని అన్నారు. కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటికి ముగింపు పలికేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు.