Boris Johnson: ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం వదులుకున్నందుకు ఎంతో బాధగా ఉంది: బోరిస్ జాన్సన్
- వివాదాలతో బోరిస్ జాన్సన్ సతమతం
- బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా
- కన్జర్వేటివ్ పార్టీ అధినేతగానూ తప్పుకున్న వైనం
- కొత్త నేతకు సహకరిస్తానన్న బోరిస్ జాన్సన్
వివిధ ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అయితే, పదవిని వదులుకోవడం పట్ల ఆయన ఇప్పుడు చింతిస్తున్నారు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం బోరిస్ జాన్సన్ బ్రిటన్ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగాన్ని వదులుకున్నందుకు ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. ఈ ఉద్యోగాన్ని వదులుకుంటున్నందుకు నేనెంత బాధపడుతున్నానో అందరూ తెలుసుకోవాలి అని అన్నారు.
అటు, బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ అధినేత పదవి నుంచి కూడా తప్పుకోవడం తెలిసిందే. కొత్తగా ఎన్నిక కాబోయే కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ కు సహకారం అందిస్తామని జాన్సన్ స్పష్టం చేశారు. కాగా, కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడ్ని అక్టోబరులో ఎన్నుకోనున్నారు. అప్పటివరకు బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగనున్నారు.