YSRCP: వైసీపీ ప్లీనరీలో ముగిసిన తొలి రోజు సమావేశాలు... 4 తీర్మానాలకు ఆమోదం
- జగన్ ప్రారంభోపన్యాసంతో మొదలైన ప్లీనరీ
- విజయమ్మ సహా పలువురు మంత్రుల ప్రసంగాలు
- రేపు 5 తీర్మానాలను ప్రవేశపెట్టనున్న నేతలు
వైసీపీ ప్లీనరీలో భాగంగా శుక్రవారం సాయంత్రం తొలి రోజు సమావేశాలు ముగిశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదలైన సమావేశాలు సాయంత్రం దాకా కొనసాగాయి. పార్టీ అధినేత హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా... పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ప్రసంగించారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లోని పలువురు మంత్రులు ఆయా అంశాలపై ప్రసంగాలు చేశారు.
తొలి రోజు ప్లీనరీలో వైసీపీ నేతలు 4 తీర్మానాలు ప్రవేశపెట్టగా...వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మహిళా సాధికారత- దిశ చట్టం, విద్యా రంగంలో సంస్కరణలు, నవ రత్నాలు- డీబీటీ, వైద్య ఆరోగ్య రంగంపై ఈ తీర్మానాలను ఆమోదించారు. ఇక రెండో రోజైన శనివారం నాటి ప్లీనరీలో మరో 5 తీర్మానాలపై చర్చ జరగనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.