Rain: అమర్ నాథ్ యాత్రను అతలాకుతలం చేసిన భారీ వర్షం... 9 మంది మృతి, పలువురు యాత్రికుల ఆచూకీ గల్లంతు!

Heavy rain and flood lashes Amarnath Yatra

  • అమర్ నాథ్ యాత్రపై వరుణుడి పంజా
  • చార్ ధామ్ యాత్రకు అంతరాయం
  • అమర్ నాథ్ ఆలయం వద్ద పోటెత్తిన వరద
  • గుహ పరిసరాల్లో 12 వేల మంది భక్తులు

చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకుపోయారు. 

పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్టు గుర్తించారు. భారీ వర్షం, వరద నేపథ్యంలో సైనికులు, ఐటీబీపీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News