Shinzo Abe: వికృతానందం: షింజో మరణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న చైనీయులు.. హంతకుడిని ‘హీరో’గా కీర్తిస్తూ పోస్టులు

Chinese celebrate Shinzo Abe death call attacker a Hero

  • ఎన్నికల ప్రచారంలో ఉండగా షింజో హత్య
  • వీబో, వియ్‌చాట్‌లలో డెత్ విషెస్ చెప్పుకుంటున్న చైనీయులు
  • స్క్రీన్ షాట్లు షేర్ చేసిన హక్కుల కార్యకర్త

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య ప్రపంచాన్ని నివ్వెరపరిస్తే చైనా మాత్రం సంబరాలు చేసుకుంటోంది. షింజో హత్యను కొందరు చైనీయులు సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రేట్ చేసుకుంటే, మరికొందరు హంతకుడిని ‘హీరో’గా అభివర్ణించారు. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో షింజో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండగా దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే చైనీయులు కొందరు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ‘వీబో’, ‘వియ్‌చాట్’లలో డెత్ విషెస్ చెప్పుకున్నారు.

ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన చైనీస్ పొలిటికల్ కార్టూనిస్ట్, ఆర్టిస్ట్, హక్కుల కార్యకర్త బడియెకావో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రపంచానికి వెల్లడించారు. షింజో మరణానంతరం చైనీయులు చేసుకున్న సంబరాలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్లను షేర్ చేశారు. ‘థ్యాంక్యూ యాంటీ జపాన్ హీరో, నేను నవ్వొచ్చా?’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే, ‘పార్టీ టైమ్’ అంటూ మరొకరు రాసుకొచ్చారు. ఇంకొందరు షింజో హత్యను కెన్నడీ హత్యతో పోల్చారు. కాగా, 1937లో చైనాపై జపాన్ జరిపిన దండయాత్రను కూడా పలువురు గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News