- వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న శ్రుతి హాసన్
- పాన్ ఇండియా సినిమాగా చేతిలో ఉన్న 'సలార్'
- షూటింగ్ దశలో బాలకృష్ణ 107వ సినిమా
- చిరంజీవి షూటింగులో ఈ రోజే జాయినైన శ్రుతి హాసన్
ఒకానొక సమయంలో శ్రుతి హాసన్ కెరియర్ గాడి తప్పింది. ఆ విషయాన్ని ఆమె గ్రహించేసరికి ఆలస్యమైపోయింది. ఆ సమయంలో కూడా ఆమెను టాలీవుడ్ ఆదుకుంది. 'క్రాక్' సినిమా హిట్ తో కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత ఆమెకి ప్రభాస్ సినిమా 'సలార్'లోను ఛాన్స్ దక్కింది.
ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో, ఈ సినిమా హిట్ కొడితే మిగతా భాషల నుంచి కూడా తనకి వరుస అవకాశాలు వస్తాయనే ఆశతో ఆమె ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగానే శ్రుతి హాసన్ మరో రెండు భారీ ప్రాజెక్టులు పట్టేసింది.
బాలకృష్ణ 107వ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ఆమె, చిరంజీవి 154వ సినిమాలోను చేస్తోంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగులో ఈ రోజు నుంచి శ్రుతి హాసన్ పాల్గొంటున్నట్టుగా చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను 'సంక్రాంతి'కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.