Kodikahti Srinivas: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు 'జగన్ పై దాడి' కేసు నిందితుడి తల్లి లేఖ

Kodikathi Srinivas mother writes letter to CJI NV Ramana

  • జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాస్ 
  • నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని శ్రీనివాస్ తల్లి ఆవేదన
  • శ్రీనివాస్ ను విడుదల చేయాలని సీజేఐకి విన్నపం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి లేఖ రాశారు. తన కుమారుడిని గత నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని లేఖలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో కానీ, ఎన్ఐఏ విచారణ కానీ జరగడం లేదని చెప్పారు. 

2018లో ఈ దాడి ఘటన జరిగింది. విజయనగరం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని హైదరాబాద్ కు వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి జగన్ చేరుకున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. కోడిపందేల్లో వాడే కత్తితో జగన్ పై శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమయింది.

  • Loading...

More Telugu News