Protestors: శ్రీలంక అధ్యక్ష భవనంలో బయటపడిన కరెన్సీ కట్టలు

Protestors find millions in cash at Sri Lanka President Rajapaksas mansion

  • గుర్తించిన నిరసనకారులు
  • వాటిని లెక్కిస్తున్న దృశ్యాలు వెలుగులోకి
  • ఆచూకీ లేని అధ్యక్షుడు రాజపక్స

శ్రీలంక అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన నిరసనకారులు ఆ తర్వాత లోపల కలియతిరిగారు. దేశాన్ని సంక్షోభం పాలు చేయడంపై వేలాది మంది ప్రజలు నిరసనలు, ఆందోళనలకు దిగడం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం అధ్యక్షుడి అధికారిక నివాసాన్ని ముట్టడించారు. ఇప్పటికీ వారు దాన్ని విడిచి వెళ్లలేదు. మరోవైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో తప్పించుకుపోయిన అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఆచూకీ లభించలేదు. ఆయన ఓడలో పారిపోయి ఉంటారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వెలుగులోకి వచ్చింది. 

పెద్ద ఎత్తున నగదు అధ్యక్షుడి నివాసంలో గుర్తించారు. నగదును లెక్కిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోని స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ, వ్యాయామ కేంద్రంలో కసరత్తులతో సందడి చేశారు. మిలియన్ల కొద్దీ కరెన్సీ నోట్లను గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. స్వాధీనం చేసుకున్న 17.8 మిలియన్ల నోట్లను సెక్యూరిటీ సిబ్బందికి అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు తర్వాతే తాము వాస్తవాలను తెలుసుకోగలమని పోలీసులు ప్రకటించారు

  • Loading...

More Telugu News