Ram: రామ్ కంటే ముందుగా ఈ కథ బన్నీ దగ్గరికి వెళ్లిందా?!

The Ghost movie update

  • రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్'
  • ఈ కథను ముందుగా విన్నది బన్నీ అంటూ టాక్ 
  • ఆయన బిజీగా ఉండటం వలన రామ్ దగ్గరికి వచ్చిందంటూ ప్రచారం  
  • తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెల 14న రానున్న సినిమా

రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందిన 'ది వారియర్' ఈ నెల 14వ తేదీన థియేటర్లలో దిగిపోనుంది. పోలీస్ ఆఫీసర్ గా రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, కృతి శెట్టి రేడియో జాకీగా కనిపించనుంది. పోలీస్ కథలు తన దగ్గరికి చాలానే వచ్చాయనీ, కాకపోతే ఈ కథ వినగానే తనకి వెంటనే నచ్చేసిందని రామ్ చెప్పాడు. 

అయితే ఈ కథ ముందుగా బన్నీ దగ్గరికి వెళ్లిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీని లింగుసామి కలిసి కథా చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథ ఇదేననే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అయితే అప్పటికే 'పుష్ప' కోసం సుకుమార్ ను బన్నీ లైన్లో పెట్టేయడం జరిగిపోయింది.

ఆ తరువాత  ప్రాజెక్టు కోసం బోయపాటికి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగిపోయింది. బోయపాటి తరువాత త్రివిక్రమ్ తో సినిమా ఉండనుంది. అందువలన ఇప్పట్లో కుదరదని బన్నీ చెప్పడం వల్లనే, ఆ కథ తీసుకుని రామ్ దగ్గరికి లింగుసామి వచ్చినట్టు చెబుతున్నారు. ఒక హీరో బిజీగా ఉండటం వలన ఆ కథలు వేరే హీరోలకు వెళ్లడం మామూలే. అయితే బన్నీ వదులుకున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎటువంటి ఫలితాన్ని రాబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News